| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పట్టపగలే జంట హత్యలు... పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల్లోనే ఘాతుకం!

పట్టపగలే జంట హత్యలు... పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల్లోనే ఘాతుకం!

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ నగర శివారులోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పట్టపగలే దారుణమైన జంట హత్యలు కలకలం రేపాయి.

షరీఫ్ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ సిద్ధిఖీ కి, అతని భార్య నూర్ బేగం కు మధ్య గత కొంతకాలంగా తీవ్ర కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. భర్త వేధింపులు భరించలేక నూర్ బేగం మీర్‌పేట్‌లోని సాయి విహార్ కాలనీలో ఉన్న తన తల్లిగారి ఇంటికి వచ్చేసింది.

ఉదయం ఫిర్యాదు ? సాయంత్రానికి హత్యలు:

తన భర్త వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన నూర్ బేగం బుధవారం ఉదయమే మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని వేడుకుంది.

అయితే ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే సాయంత్రం సుమారు 4 గంటలకు సిద్ధిఖీ కత్తితో అత్తగారి ఇంటిపై దాడికి తెగబడ్డాడు.

ఇంట్లోకి చొరబడి అత్త షేక్ నిరంజన్ బీ (50), బావమరిది భార్య రేష్మా (40)లతో పాటు బావమరిది యూసుఫ్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో నిరంజన్ బీ, రేష్మా అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యూసుఫ్ ను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:

ప్రాణభయం ఉందని ముందే చెప్పినా పోలీసులు స్పందించకపోవడంపై మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే ఇద్దరు మహిళల ప్రాణాలు దక్కేవని ఆరోపిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సిద్ధిఖీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

#Meerpet #Hyderabad #DoubleMurder #CrimeNews #Telangana #DailyBharat #BreakingNews

Previous పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి... మీ ఓటు కేవలం ఓటు కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆయుధం : కీర్తిరెడ్డి
Next గుండా మధుకర్‌కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం
ADVERTISEMENT