| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హత్యా రాజకీయాలు చేసే పుట్ట మధుకు గన్ మెన్ లు అవసరమా?:ఇనుముల సతీష్

హత్యా రాజకీయాలు చేసే  పుట్ట మధుకు గన్ మెన్ లు అవసరమా?:ఇనుముల సతీష్

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా:మంథని నియోజకవర్గంలో హత్య రాజకీయాలు గుండాగిరి దౌర్జన్యం చేస్తూ ప్రజలను ప్రతిపక్ష నాయ కులను  భయభ్రాంతులకు గురిచేసిన జెడ్పి చైర్మన్ పుట్ట మధు కు గన్ మెన్ లు ఎందుకని డిసిసి అధికార ప్రతినిధి మంథని డివిజన్ మీడియా కన్వీనర్ ఇను ముల సతీష్ అన్నారు.

శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని  ఎంపీపీ కొండా శంకర్, మంథని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంవత్సరాల నుండి మంథని నియోజకవర్గం లో హత్య రాజకీయాలు చేస్తూ గుండాగిరి చేస్తూ కోట్లల్లో ఆస్తులు కూడబెట్టుకొని అక్రమంగా భూములు సేకరించి  అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ కుట్ర హత్య రాజకీయాలు చేసిన పుట్ట మధుకు నేడు ప్రాణ భయం రావడం శోచనీ యమని, ఇనుముల అన్నారు.

మంథని నియోజక వర్గంలో ఎంతో మంది ఎస్సీ బీసీల ను హత్యలు చేయించిన చరిత్ర పుట్ట మధుకుంద న్నారు.పట్టపగలు న్యాయ వాద దంపతులను చంపిం చింది ఎవరని ఆయన ప్రశ్నించారు.

న్యాయ దంపతుల హత్యకేసులో జైలుకు వెళ్ళింది పుట్ట మధు మేనల్లుడు కాదా? జడ్పీ చైర్మన్ హస్తం లేదా అని అయన ప్రశ్నించారు..

నమ్మిన వారిని మోసం చేయడం లో పుట్ట మధు కు వెన్నతో పెట్టిన విద్య ఇప్పడు ఆ విద్యనే తన పైన తన శిష్యులు  ప్రయోగిస్తు న్నారని ఇనుముల ఆన్నారు.

హత్య రాజకీయాలు చేసే పుట్ట మధు కు గన్ మెన్ ఉండాల్సిన అవసరం ఏముందన్నారు...విశ్వాసం కోల్పోయిన జడ్పీ చైర్మన్ పైన అవిశ్వాసం పెడితే తప్పేంటి అన్నారు

ఆనాడు తమ నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు వెన్నుపోటు పొడిచిన విషయం పుట్ట మధు కు గుర్తులేదా? అని ప్రశ్నిస్తున్నాడు..

పుట్ట శైలజ మున్సిపల్ చైర్మన్ గా ఉండి కూడా కౌన్సిలర్ల విశ్వాసాన్ని చూడడం లేదని అందుచేత మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాసం పెట్టారన్నారు...

ఈ సమావేశంలో మున్సి పల్ కౌన్సిలర్లు శ్రీపతి బానయ్య, వి కే రవి, చొప్పకట్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు...

Previous బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని భారీ ర్యాలీ
Next ఎమ్మేల్యే శంకర్ వీరాభిమాని అశోక్ చిత్రపటం బహుకరణ
ADVERTISEMENT