| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అవినీతి విరోధక శాఖ అధికారుల బృందాల దాడులు కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వచ్చినట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయం నుండి దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం తో పాటు నగరంలోని ప్రగతి నగర్ లో ఈఎస్ నివాసముండే ఆయన ఇంటిపై ఏకధాటిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ కార్యాలయంలోని కొన్ని డాక్యుమెంట్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఈఎస్ ఇంట్లో నుంచి పలు రికార్డులతో పాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఈఎస్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ఈఎస్ ఇంటిపై సైతం ఏసీబీ అధికారుల బృందం దాడి చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Previous ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Next కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
ADVERTISEMENT