Posted on 2026-06-19 12:54:52
డైలీ భారత్, నిజామాబాద్: హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డును నెలకొల్పిందని, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, పి విజయ్ వర్మ 381 కిడ్నీ మార్పిడి చేస్తున్న చికిత్సలను ఎంతో విజయవంతంగా నిర్వహించి కిడ్నీ సమస్య బాధితులకు పునర్జన్మ ప్రసాదించడం జరిగిందని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కిడ్నీ మార్పిడిలో తాము సాధించిన విప్లవాత్మక పురోగతిని వివరించారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్త గ్రూపులు ముఖ్యం అయితే తమ హాస్పిటల్స్ బృందం బ్లడ్ గ్రూప్ వేరుగా ఉన్న రోగులకు ఇన్ కంప్లైంటబుల్ విజయవంతంగా కిడ్నీ మార్పిడిలో విజయం సాధించడం జరిగిందని నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. వయోభారంతో సంబంధం లేకుండా చికిత్స శస్త్ర చికిత్సల విషయంలో వయసు ఒక అడ్డంకే కాదని నిరూపించడం జరిగిందని అన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులలో కూడా కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి వారికి మరో జన్మను అందించడం జరిగిందన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి ఓ మైలురాయిని చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ వర్మ మాట్లాడుతూ కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులకు డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కిడ్నీ మార్పిడి వల్ల రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడతాయి అన్నారు. అవగాహన పెరగాలన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ అత్యాధునిక మౌలిక సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలకు అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ గా ఎదుగుతుందని ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >