| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లాలో సివిల్ సప్లై కి సంబందించిన బియ్యం ఎగవేత

జిల్లాలో సివిల్ సప్లై కి సంబందించిన బియ్యం ఎగవేత

వీటికి దారులైన మిల్లర్లపై, ఎం.ఎల్.ఎస్  పాయింట్ ఇంచార్జ్ లపైన పెట్టిన ఆర్ ఆర్  ఆక్ట్ కు సంబందించిన చర్యలు సత్వరమే తీసుకోవాలి

జిల్లా కలెక్టర్  రాజర్షి షా 

డైలీ భారత్, మెదక్:సోమవారం కలెక్టర్ చాంబర్ లో రెవిన్యూ సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. ఈ  సందర్బంగా లక్ష్మి నర్సింహా రైస్ మిల్, నర్సాపూర్ శ్రీధర్ గుప్తా రైస్ మిల్, మాసాయిపేట చైతన్య ఆగ్రో, పాపన్నపేట భవాని రైస్ మిల్, రామాయంపేట భవాని రైస్ మిల్లర్లు ,  సిఎంఆర్  లు ఇవ్వకుండా బకాయిలు పడ్డ వారిపై ఆర్ ఆర్ ఆక్ట్ ప్రకరాం సత్వరమే చర్యలు తీసుకోవాలని , స్థిర చర ఆస్తుల వివరాలు సేకరించి వారి ఆస్తుల జప్తుకు,  ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ గోదాములలో బియ్యం అవకతవకలకు పాలు పడిన సిబ్బంది పై  RR ఆక్ట్ ప్రకారం తాకీదు సిద్ధం చేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్  వెంకటేశ్వర్లు , డి యం  సివిల్  సప్లైయి  హరికృష్ణ , డి సి ఎస్ ఓ  బ్రహ్మరావు , ఆర్ డి ఓ లు శ్రీనివాస్ , జయచంద్ర , అంబదాస్ రాజేశ్వర్ ,తహసీల్దార్లు  , సిబ్బంది పాల్గొన్నారు

Previous ఎంపీపీ చేతుల మీదుగా పల్లె దవాఖానా ప్రారంభం
Next మెదక్ జిల్లాలోని మైనింగ్ అధికారుల తనిఖీలు-- ఏ డి జయ రాజ్
ADVERTISEMENT