| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

డైలీ భారత్, వరంగల్: భూతగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం వహిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు “కౌన్సిలింగ్” నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. 

వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం కెయూసి పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ఏసిపి నర్సింహరావు, ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికాలికారు.  పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలు, స్టోర్, కేసు ప్రాపర్టీగదులు, స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణాన్ని పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ సంబంధించిన రికార్డులను, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులను పరిశీలిస్తూ, పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టివ్‌గా వున్న రౌడీ షీటర్లు, అనుమానితులు ఎవరు, ప్రస్తుతం వాళ్ళు ఎలావున్నారు..ఏం చేస్తున్నారు మొదలైన వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తగాదాల్లో తలదూర్చే రౌడీ షీటర్లతో పాటు బెదిరింపులకు పాల్పడే వారికి ప్రత్యేక “కౌన్సిలింగ్” ఇవ్వాలని, రౌడీ షీటర్లపట్ల సానుభూతి ధోరణి ప్రదర్శించవద్దని, యాక్టివ్‌గా వున్న రౌడీపై నజర్ పెట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ముఖ్యంగా స్థానికంగా వున్న సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై ముమ్మరంగా అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలని, స్టేషన్ ఎస్.ఐలు అప్పగించిన సెక్టార్ పరిధిలో నేరాల నియంత్రించడంతో పాటు, ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో ఎస్.ఐలు నవీన్ కుమార్, కళ్యాణ్‌కుమర్, రాజమౌళి పాల్గోన్నారు.


#TelanganaDGP, #TelanganaCOPs, #warangal 

Previous వెంకటసాయి నగర్‌ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Next కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం
ADVERTISEMENT