| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..

వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..

దేవాలయాల్లో "వీఐపీ సంస్కృతి"పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. 

దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టీకరణ.. 

దేవుడు ఎవరి కోసమూ వేచి ఉండరు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే.. అప్పుడు వెళ్లడానికి వీల్లేదంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

డైలీ భారత్, చెన్నై: దేవాలయాల్లో నడుస్తున్న "వీఐపీ సంస్కృతి" పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని, అక్కడ ప్రత్యేక వర్గాలంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేసింది.

“ ఈ సృష్టిలో దేవుడొక్కడే అసలైన వీఐపీ. ఆయన ఎవరి కోసమూ వేచి ఉండరు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి వెళ్లడానికి వీల్లేదు” అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించేలా సాగుతున్న ప్రత్యేక దర్శనాల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది.

Previous ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై గ్రామస్థుల తిరుగుబాటు
Next ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
ADVERTISEMENT