Posted on 2026-05-29 08:47:49
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్‌ను సందర్శించి ధాన్యం దిగుబడి తీరును పరిశీలించారు. మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్‌లోడింగ్ చేసి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం దిగుబడి శాతం, రికవరీ వివరాలు, సీఎంఆర్ లక్ష్యాల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా అందజేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, రైస్ మిల్లర్లు,సంబంధిత అధికారులు, మిల్ యాజమాన్యం పాల్గొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >