| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాలు ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అందజేత

కాలు ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అందజేత

సకాలంలో రక్తాన్ని అందజేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కస్వ సుజిత్

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో ప్రమాదంలో గాయపడిన భూమయ్య (48)కు కాలు ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కస్వ సుజిత్ సహకారంతో సకాలంలో అందజేయడం జరిగిందని అన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కావడం వలన పట్టణంలోని రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోవడం జరిగిందని చాలామంది రక్తదానం చేయడం వలన బలహీనతలు ఏర్పడతాయని ముందుకు రావడంలేదని రక్త దానం చేసే వారికి ఎలాంటి బలహీనతలు ఏర్పడమని ప్రతి సంవత్సరం రెండుసార్లు రక్తదానం చేయడం వలన గుండెజబ్బు,క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్నో సర్వేలు తెలియజేయడం జరిగిందని దీనిని దృష్టిలో పెట్టుకొని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రక్త దానానికి ముందుకు వచ్చిన సుజిత్ కు అభినందనలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, కోశాధికారి కస్వ వెంకటేష్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ లు పాల్గొనడం జరిగింది.

Previous కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం... అక్రమ తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్‌కు స్కెచ్!
Next సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య
ADVERTISEMENT