| Daily భారత్
Logo




ప్రభుత్వ విద్యా పరిరక్షణకై పోరాడుదాం

News

Posted on 2026-05-28 14:51:00

Share: Share


ప్రభుత్వ విద్యా పరిరక్షణకై పోరాడుదాం

చలో హైదరాబాద్ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేద్దాం

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘు శంకర్ రెడ్డి పిలుపు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అపసవ్య విధానాల వలన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం రోజురోజుకు నిర్వీర్యమై, సంక్షోభం లోకి నెట్టబడుతున్నదని, మరోవైపు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేట్కీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్య ఉనికిని, భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5 2026 రోజున హైదరాబాదులో ర్యాలీ, ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రవిశంకర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ(TSEC) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు డి రామనాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగింది.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విద్యాపరక్షణ కమిటీ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని ,పాఠశాలలు,మౌలిక భౌతిక వసతులు మెరుగుపరచాలని, అలాగే విద్యను కేంద్రీకరించే విధంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను నిలిపివేయాలని, ప్రస్తుత గురుకులాలు ఉన్న ప్రాంతాలలోనే నిర్వహించాలని , అలాగే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు మేరకు నిర్మించాలనుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కూడా మానుకోవాలని, ప్రస్తుత ఉన్న పాఠశాలల్లోనే సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ విద్య విధానం 2020 అమలను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రజలు,ప్రజాస్వామిక వాదులు ,పౌర సమాజం అందరూ కలిసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, పరిరక్షించుకోవాలని బాధ్యతగా ముందుకు రావాలని బుద్ధి జీవులు, విద్యావేత్తలు ఆలోచించాలని రఘుశంకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు,

అనంతరం ధర్నా కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో తెలంగాణ విద్యాపరి రక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి జిల్లా , అధ్యక్షులు ఏ రాజేశ్వరరావు, TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి అంజయ్య, DTF జిల్లా అధ్యక్షులు అవురం సుధాకర్ రెడ్డి జిల్లా,రాష్ట్ర నాయకులు డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బూరసదానందం,దొంతుల శ్రీహరి,మైలారం తిరుపతి,T సురేష్,N పర్షరాములు,G శ్రీనివాస్,B రాజేందర్ మో వారు పాల్గొన్నారు

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >