డైలీ భారత్, కొండగట్టు: పెద్దహనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మానికి ప్రతీకగా, భక్తికి నిలువెత్తు రూపంగా, అచంచలమైన సేవాభావానికి ఆదర్శంగా నిలిచిన ఆంజనేయ స్వామి వారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి, రైతాంగానికి సమృద్ధి కలగాలని స్వామివారిని వేడుకున్నారు. హనుమంతుని భక్తి, బలం, నిస్వార్థ సేవా స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని తెలిపారు.
News
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..