| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

డైలీ భారత్, సిరిసిల్ల: మతసామరస్యాన్ని కాపాడుతూ, ఇతరుల మనోభావాలకు కించపరచకుండా పండుగల నిర్వహణ చేపట్టాలని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని,అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పోలీసు శాఖకు తెలియజేయాలని తెలిపారు. సొంతంగా వాహనాలను ఆపడం తనిఖీలు చేయడం లాంటివి వద్దని తెలిపారు.సోషల్ మీడియా పోస్టులు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 ద్వారా లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Previous రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Next తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి
ADVERTISEMENT