| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ మిషన్ అందించిన అంబేద్కర్ సంఘము సభ్యులు

పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ మిషన్ అందించిన అంబేద్కర్ సంఘము సభ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపేట లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. విద్యార్థులు కస్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకరావాలని స్థానిక కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు ముప్పైయి వేల రూపాయల విలువ గల 150 లీటర్ల సామర్ధ్యం గల నీటి శుద్ధ జల యంత్రం (వాటర్ ప్యూరిఫయిర్ మిషన్) ని అంబేద్కర్ సంఘము సభ్యులు పాఠశాలకు అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్,అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు మచ్చ రామాంజనేయులు,మల్లేశం, రాజు, శ్రీనివాస్, కమ్మరి రమేష్,నవీన్, సురేష్,బాబు,దాస్ నర్సయ్య, ప్రభుదాస్, జీవన్,పూర్వ విద్యార్థులు మరియు అంబెడ్కర్ నగర్ కాలనీ వాసులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కొండికొప్పుల రవి, రామ్ చందర్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Previous బాలుడి ప్రాణంతీసిన మూఢనమ్మకం
Next మెడికల్ షాపుల పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు
ADVERTISEMENT