చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేశారు
డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్తు కార్యాలయం వద్ద 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పిటిసి పోదాం శీను ప్రజా ప్రతినిధులు, మండలం ఎంపీటీసీలు అధికారులు, అనధికారులు, అనధికారులు యువజన సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరింగిందిని పేర్కొన్నారు అనంతరం ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా గణతంత్ర వేడుకలు మనసు పూర్వకంగా సంతోషంగా స్వేచ్ఛగా జరిగే వేడుక గణతంత్ర వేడుకలు అని ఎంపీపీ సూచించారు గణతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనడం ప్రేమ ఆప్యాయతతో జనగణమన పాటతో అందరం మనసు తలంపుతో వందనం చేస్తూ గణతంత్ర వేడుకలు గంభీరంగా చేగుంట మండలంలో జరుగుతాయని అన్నారు ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాసు అని తెలిపారు.
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం... మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా భారతదేశంలో జరుపుకుంటున్నామని అన్నారు అనంతరం మొదటిసారి ఈ రిపబ్లిక్ డే ను 1950 జనవరి 26న నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలు ఈ దినోత్సవాన్ని పల్లెల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు సొంతంగా సమానంగా స్వతంత్రంగా గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అని ఎంపీపీ అన్నారు అదేవిధంగా చేగుంట మండలంలో ఉన్న ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు సంఘాల నాయకులకు
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మూదం శ్రీను ఎమ్మార్వో ఎంపీడీవో ఆర్ఐ వీఆర్వోలు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు చేగుంట మండలం కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.