డైలీ భారత్, కామారెడ్డి: “రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి. అని దోర్నాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతిష్ఠించారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, నిచ్చెన మెట్ల వ్యవస్థ రద్దుకు ఆయన చేసిన కృషి అపారమైనది. విద్య లేకపోవడం సమాజ వెనుకబడటానికి ప్రధాన కారణమని గుర్తించిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకం, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కూడా ఆయన నిరంతరం పోరాటం చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది ఆయన పేర్కొన్నారు.
News
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్