Posted on 2026-04-13 14:00:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐకెపి సెంటర్లు కొన్నిచోట్ల నామమాత్రంగానే ఉన్నవి ఎక్కడ కొనుగోలు జరగట్లేదు ఒడ్లు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలి, పెండింగు ఉన్న రైతు భరోసా డబ్బులు రైతుల ఎకౌంట్లో తక్షణమే వేయాలి, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు వరకు కూడా ఒక్కసారి కూడా డబ్బులు వ్యవసాయ కూలీల ఖాతాలో వెయ్యలేదు, రెండు లక్షలు దాటిన రుణాలు మాఫీ చేస్తామని ఈరోజు వరకు కూడా మాఫీ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం పంట నష్టపోతే నష్టపరారం చెల్లించేందుకు ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా రైతులను ఇబ్బంది గురిచేస్తుంది, వెంటనే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిలుకూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు భూక్య శ్రీను, రాపాక రమేష్, బలగం శ్రీధర్, జాటోత్ వెంకన్న నాయక్, బానోత్ కుమార్, సిరిపురం ప్రసాద్, తెల్ల నరసింహారావు, నిమ్మటూరి రామారావు, వందనపు సుబ్బు బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >