పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటాం
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నందిగామ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజాలతోనే ప్రజల కోసమే తన ప్రయాణం ఉంటుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని నర్సప్పగూడ, చేగూర్, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా ఉంటామని, కార్యకర్తలు అధైర్య పడకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.