| Daily భారత్
Logo




ఫలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

News

Posted on 2026-04-06 18:46:52

Share: Share


ఫలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్

రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు

మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు 

డైలీ భారత్, పిఠాపురం:రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. 

 పవన్ కళ్యాణ్ అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రధాన మంత్రి కి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి కి, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి  కి పవన్ కళ్యాణ్  కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >