Posted on 2026-03-30 17:58:17
డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించిన "Arrive Alive-2026" కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే వెంబడి ఉన్న దాబాలు, హోటల్స్, పంచర్ షాపుల యజమానులు, ఆటో డ్రైవర్లు మరియు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలలో ఒక వారం పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ఏటా హత్యల ద్వారా సుమారు 800 మంది మరణిస్తుండగా, రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గత 2024 సంవత్సరంలో 275 మంది మరణించగా, పోలీసుల ముందస్తు చర్యలు మరియు నిరంతర తనిఖీల వల్ల 2025 నాటికి ఆ సంఖ్య 220కి తగ్గిందని, అంటే ఒకే సంవత్సరంలో 55 మంది ప్రాణాలను కాపాడగలిగామని వివరించారు. ఒక ప్రాణం కోల్పోవడం అంటే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, భావోద్వేగంగా కుప్పకూలిపోవడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ (D&D) కేసులను కఠినంగా అమలు చేయడం, అతివేగాన్ని (Over Speed) నియంత్రించడం మరియు నిరంతర వాహన తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ గారు వెల్లడించారు. అలాగే, ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 5 నుండి 10 నిమిషాలు (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించాలని సూచించారు. కొన్నిసార్లు అంబులెన్స్ రావడానికి సమయం పడితే, ఆ లోపు బాధితుడికి CPR (Cardio Pulmonary Resuscitation) చేయడం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్లు మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సీపీఆర్ ఎలా చేయాలనే అంశంపై లైవ్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కూడా సీపీఆర్ ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, భిక్నూర్ సీఐ సంపత్, దేవునిపల్లి, రాజంపేట, దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >