Posted on 2026-03-23 16:08:11
డైలీ భారత్,వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27-03-2026 శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు సౌకర్యంగా కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 15 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భద్రతా దృష్ట్యా బ్యారికేడ్లు, ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నడవడానికి గ్రీన్ మ్యాట్లు పరచనున్నారు.
భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందుబాటులో ఉంచనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, టెంట్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ కూడా నిర్వహించనున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయ ఉద్యోగులకు సూచించారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >