డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది. సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు.
రాజరాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.
కాగా, అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో భాగంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన అర్చకులు.