భక్తి భావాలతో ఆధ్యాత్మికంగా విధి విధుల్లో అక్షింతలు పంపిణీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అయోధ్య లో జరిగే శ్రీరామ మందిరం ప్రధానమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో దేశమంతా ఇంటింటికి అయోధ్య అక్షింతలు చేరుకున్నాయి.రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలో సొలిపూర్ గ్రామంలో రామ భక్తులు ఇంటింటికి పరమ పావణమైన అక్షింతలు రామ భక్తులు విధి విధుల్లగుండా ఆధ్యాత్మికంగా పంపిణీ చేయడం జరిగింది.అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను వాటిని ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో మణి పంతులు , పులిమామిడి రాజేష్ గౌడ్ , నందు యాదవ్ ,అనిల్ (టిల్లు) , మునుర్ శ్రీనివాస్ , ఎస్ లక్ష్మయ్య , భారత్ , అభి , మహేష్ గౌడ్ ,కుమ్మరి శేఖర్ ,హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.