సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఎమ్మెల్యే శంకర్ లకు సిపిఐ పార్టీ ఘన సన్మానం
ఘనంగా సిపిఐ అభినందన సభ
హాజరైన మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాప్ రెడ్డి జెడ్పిటిసిలు వెంకట్రాం రెడ్డి, విశాల మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్ష పార్టీలు పేదల పక్షపాతిగా నిలబడ్డాయని అందుకే ఎన్నికల్లో విజయం సాక్షాత్కారమైందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వీ కన్వెన్షన్ హాల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లకు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, ఫరూక్ నగర్ జెడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభినందన సభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు. శాసనసభలో ఒకే ఒక్కడుగా ప్రజాసేవకు అంకితమై తన గొంతుకను వినిపించేందుకు సాంబశివరావు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా తనకు మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టినందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు. ప్రజా స్వామ్యంలో పాలన గాడి తప్పినప్పుడు కమ్యూనిస్టులు ఎల్లప్పుడు గాడిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటారని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఎల్లప్పుడూ వారి సూచనలు సలహాలు ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనుభవం తనలాంటి కొత్తగా ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యేలకు ఉపయోగపడతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మిత్రపక్షంగా సాయం చేసిన మేలు మర్చిపోలేమని సిపిఐ కాంగ్రెస్ పార్టీల ఆశయ సాధన వర్ధిల్లుతుందని అన్నారు.
గత ప్రభుత్వాల ఆగడాలకు పేద ప్రజలు బలైపోయారని ఈ సందర్భంగా అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వరవడితో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పాలనలో సిపిఐ విలువైన సూచన సలహాలు ఉండాలని, కూనంనేని సాంబశివరావు ఎంతో గొప్ప మేధావి అని వారి అనుభవం ప్రజాస్వామ్య పాలనకు తోడవాలని కోరారు. సిపిఐ మేధాశక్తిని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందని అన్నారు. రాష్ట్రము కేంద్రాలలో వారి అవసరాలు ఎక్కువగా ఉంటాయని శంకర్ అన్నారు. వీర్లపల్లి శంకర్ ను సిపిఐ నాయకులు పానుగంటి పర్వతాలు బుద్దుల జంగయ్య పవన్ తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సన్మానించారు..