Posted on 2026-02-17 19:35:10
డైలీ భారత్, తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: ఈ రోజు (17.02.2026) వ తేదీన, గౌరవనీయులైన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్. ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో తిరుపతి పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో త్రాగి వాహనం నడిపిన వాహనదారులపై 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వాహనదారులపై 03 కేసులు నమోదు చేయడం జరిగింది.
వాహన తనిఖీలలో పట్టుబడిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలోని 10 మంది నిందితులకు 1వ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి వారు విచారణ అనంతరం ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మొత్తం రూ.1,00,000/- జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 03 మందికి ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున మొత్తం రూ.1,500/- జరిమానా విధించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలి, మద్యం సేవించి వాహనం నడపడం చట్ట రీత్యా నేరం.. మీప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది. ప్రజలు ఇది గమనించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించి సహకరించాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేసారు.
#AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #AndhraPradeshPolice #TirupatiPolice
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >