Posted on 2026-02-17 16:23:59
డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు నార్కోటిక్ డ్రగ్స్ పైన , పరీక్షలలో ఒత్తిడిని జయించడం పై విద్యార్థులకు అవగాహన సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ నిర్వహించినారు.
తెలంగాణ గురుకుల పాఠశాల బద్దెనపల్లి , మరియు నేరెళ్ల గర్ల్స్ కాలేజ్, కస్తూర్బా బాలికల విద్యాలయం, తంగల్లపల్లి విద్యార్థులకు పరీక్షలపై సానుకూల దృక్పథం డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నం చందర్ మాట్లాడుతూ డ్రగ్స్ లోని రకాలు వాటి వినియోగం వలన కలుగు దుష్పరిణామాలు వివరించారు. వాటిని ఉపయోగించే వారికి దూరంగా ఉండాలనీ పిల్లలకు సూచించారు.
చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడం పరీక్షల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం ద్వారవపరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన సలహాలను కౌన్సిలింగ్ ద్వారా అందించారు.
అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు మనమందరం సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్, డా. చంద్రిక ,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు, కానిస్టేబుల్ నరేందర్, హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్, ప్రధానోపాధ్యాయులు పాఠశాల బృందం పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >