| Daily భారత్
Logo




పెండింగ్ లో ఉన్న అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

News

Posted on 2026-01-10 15:42:36

Share: Share


పెండింగ్ లో ఉన్న అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకై అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించద్దని పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో భాగంగా ప్రజలకు భవిష్యత్తులో యూజీడి పనుల వల్ల మ్యాన్ హోల్స్ పనుల ఏర్పాటులో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనులు చేపట్టాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో వాటర్ వర్క్స్, నీటి ట్యాంకుల పనుల కు సంబంధించి నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసి త్వరత కట్టిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా అన్ని పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనులు చేస్తే తాను సహించ చేయించబోనని ఆయన స్పష్టం చేశారు. అలాగే టి యు ఎఫ్ ఐ డి సి ఫండ్ కింద అరవై కోట్లు మంజూరయ్యాయని, అందులో ప్రతి డివిజన్ కు ఒక కోటి రూపాయల చొప్పున అభివృద్ధి, మరమ్మత్తుల పనుల కోసం టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా అవసరాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని కాంట్రాక్టర్లు, అందుకు సంబంధించిన అధికారులు బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని అధికారులను సుతి మెత్తగా మందలించారు. నగర అభివృద్దే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇన్చార్జి మున్సిపల్ ఈ ఈ నగేష్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఏ ఈ శంకర్ సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >