డైలీ భారత్, మెదక్:ఈ నెల 25 న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారుల ను అదేశించారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో బుదవారం జిల్లా అధికారులు, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు,మెదక్ జిల్లాలో ఉన్న కళాశాల ప్రిన్సిపల్స్ , కళాశాల శాఖ అదిపతులతో (హెచ్ ఓ డి) ల తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం , నియోజక వర్గం, మండల కేంద్రంల లో ర్యాలీ లు నిర్వహించాలని,
జిల్లా లో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలో, కళాశాలలో వ్యాస రచన,ఉపన్యాస,చిత్రలేఖనం ,లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎలక్ట్రోరాల్ లిటరసీ క్లబ్స్ అధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగ నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.
ఉత్తమ ఈ ఎల్ సి లు, బి ఎల్ ఓ లకు,జిల్లా స్థాయి లో గెలుపొందిన విద్యార్థులకు, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశoస పత్రలు పంపిణీ చేస్తామన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి ఎల్ ఓ లు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరపాలన్నారు. నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఓటరు కార్డు లను అందజేయాలన్నారు .
"ఓటు వేయడం మించి మరొకటి లేదు"
నేను కచ్చితంగా ఓటు వేస్తాను " అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
జనవరి 1 ,2024 నాటికి 18 సం : నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి తెలిపారు.
20,21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, డిఆర్ఓ పద్మాశ్రీ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.