డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 30 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయంలో దాతల సహకారంతో అద్భుతమైన అభివృద్ధి చేశారని అంతర్గత రోడ్లకు 30 లక్షల రూపాయలు సీడిఎఫ్ నిధుల నుండి ఇస్తున్నట్లు తెలియజేశారు అంతేకాకుండా అయ్యప్పస్వామి దేవాలయానికి సింహద్వారం సొంత ఖర్చులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు
News
నర్సంపేట: అయ్యప్ప స్వామి దేవాలయంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన