| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లాను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు

జిల్లాను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో చలి పంజా విసురుతుంది. సాయంత్రం ఐదు నుండి ఉదయం 11 అయినా గాని చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే జిల్లాలో ఓవైపు పంచాయతీ ఎన్నికల పెరుగుతున్న నేపథ్యంలో చలి తీవ్రత మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం తోపాటు రాత్రి వేళల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టడానికి బయటకు సైతం వెళ్లడం లేదు. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు విధుల్లో ఖచ్చితంగా పై అధికారుల ఆదేశాల ప్రకారం చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో  నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో సాలుర 7.3°C, చిన్న మావంది 7.6, కోటగిరి 8.3, జకోరా, గోపన్నపల్లి 8.9, పొతంగల్ 9, కల్దుర్కి 9.2, మదన్ పల్లె 9.5, చందూర్, మంచిప్ప 9.6, బెల్లాల్ 9.7, డిప్పల్లి, మోస్రా 9.8, ఎడపల్లి, మెండోరా, రుద్రూర్ 9.9, నవీపేట్, పాల్డా, నిజామాబాద్, గన్నారం 10°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.


Previous రైతు పుట్టుక పాపపు పుట్టుకనా? ఏంది! లేకపోతే మరీ ఇదేందీ
Next పల్స్ పోలియో.. "రెండు చుక్కలు - నిండు జీవితం"
ADVERTISEMENT