| Daily భారత్
Logo




ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

News

Posted on 2025-11-13 19:11:41

Share: Share


ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

ప్రభుత్వ సలహాదారుడే కాదు ఇకపై జిల్లాకు ఆయనే మంత్రి ఆయనే రాజు అని స్పష్టం చేసిన పిసిసి చీఫ్

పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

అధిష్టానం తనకు ఇచ్చిన బాధ్యతలను గుర్తించి మరింత సమర్థవంతంగా పనిచేస్తా

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతాం..

ఆసియా ఖండంలోనే నెంబర్ 2గా పేరొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది

ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు పి సుదర్శన్ రెడ్డి ఘాటు విమర్శ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ సలహాదారుగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

సన్మాన సభలో భాగంగా నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్ నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వేలాదిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం కలిగిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు మాత్రమే కాదని, ప్రత్యేకించి ఇకపై జిల్లాకు ఆయనే మంత్రి ఆయనే రాజు అని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత ఆయన చొరవతో వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అన్నారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు దండుకుందని, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ  లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. ఇచ్చేది కాదని స్పష్టం చేశారు. అలాగే 35ఏళ్ల కల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకోవచ్చామన్నారు. త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్ కట్టబోతున్నాం అని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ, విద్యా, వైద్యపరంగా ముందంజలో ఉంచబోతున్నామని, బోధన్ లో పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. పార్టీలో కష్టపడి పనీచేసే వారికి గుర్తింపు కల్పిస్తామని అందుకు పదవులు సైతం కల్పిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ

గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో, ఆసుపత్రిలలో సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు.

 ఇక పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరుగుతుందని తమ పార్టీ వారు కాకపోయినా సరే అర్హత ఉంటే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించడం జరుగుతుందన్నారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాపై పెట్టిన పదవిని బాధ్యతతో పనీ చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు

తీసుకు వెళ్తానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం జిల్లాకు చేసిందేమి లేదని, ఆసియాలో రెండో నంబర్ షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తాము అధికారంలోకి వచ్చాక 200 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాకీలు కట్టామన్నారు. వ్యవసాయపరంగా నిజామాబాద్ జిల్లాను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన అన్నారు. త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలుపించాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలో అభివృద్ధికి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక  రూ.500కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

Image 1

ప్రమాదకరమైన గుంతను మానవత్వంతో పూడ్చిన యువకులు

Posted On 2025-12-09 15:35:00

Readmore >
Image 1

మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు...

Posted On 2025-12-09 15:34:00

Readmore >
Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు

Posted On 2025-12-09 12:48:45

Readmore >
Image 1

దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Posted On 2025-12-09 11:26:29

Readmore >
Image 1

రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?

Posted On 2025-12-09 11:22:22

Readmore >
Image 1

సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

Posted On 2025-12-09 11:21:25

Readmore >
Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >