| Daily భారత్
Logo




తెలంగాణ ఇంజనీర్ల నైపుణ్యం మహా అద్భుతం

News

Posted on 2023-09-09 09:49:49

Share: Share


తెలంగాణ ఇంజనీర్ల నైపుణ్యం మహా అద్భుతం

డైలీ భారత్, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు ఏర్పాటు చేసిన వాటర్‌ కండక్టర్‌ సిస్టమ్‌ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం.

ప్రధాన ఓపెన్‌ కెనాల్‌ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్‌ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం.

ఒక్కో సర్జ్‌పూల్‌ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్‌ ద్వారా సగటున కిలో మీటర్‌ వరకు ప్రయాణించాల్సి ఉంది.

మొత్తం 11 ప్రధాన సొరంగాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్‌వర్క్‌ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్‌ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం.

అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తొలుత ఓపెన్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >