| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరదల్లో కొట్టుకుపోయే స్టితుల్లో ఉన్నాం. కాపాడండి సారు

వరదల్లో కొట్టుకుపోయే స్టితుల్లో ఉన్నాం. కాపాడండి సారు

కామారెడ్డి జిల్లా ప్రజల కన్నీటి పర్యం

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ప్రజలు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి వరద నీటి నుంచి తమను కాపాడాలంటూ జిల్లా అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్న దయనియా పరిస్థితి నెలకొంది. వరద నీటి తో తాము వరద నీటిలో చిక్కుకొని బ్రతుకుతమో లేదా వరదలో కొట్టుకుపోయి చనిపోతామేమోనని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి.

కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి తమల వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడడానికి హెలికాప్టర్ల సహాయంతో కాపాడాలని వారు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతోపాటు చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల నుండి వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.

Previous కామారెడ్డి ఉదృతంగా కురుస్తున్న భారీ వర్షానికి ఒకరు మృతి
Next ఒకవైపు భారీ వాన.. మరోవైపు మండపాలకు తరలి వెళ్తున్న గణనాథులు
ADVERTISEMENT