డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఏదైనా ర్యాగింగ్ కేసులు రాత్రి వేళలో జరిగినప్పుడు అత్యవసరంగా మీడియా తన విధుల నిమిత్తం ఆ వార్తను కవరేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగిందని ఆ బాధితున్ని వన్ టౌన్ కు తీసుకువచ్చిన తర్వాత ఆ విషయం గురించి మీడియా అక్కడున్న పోలీసులను వివరణ అడగగా అక్కడున్న ఓ ఎస్ ఐ. నీవెవరు, నీ ఐడి కార్డు, అక్రిడేషన్ కార్డు చూయించు అని దబాయించేసాగాడు. అంటే లో లోపల ఇంకేదైనా జరుగుతుందా అనే విషయం పోలీసుల తీరు పట్ల అద్దం పడుతుంది. రాత్రి 11:30 కి ఘటన జరిగిందని మీడియాకు సమాచారం అందడంతో ఆ విషయాన్ని కవరేజ్ చేయడానికి వెళితే నువ్వు మీడియా అని అనడానికి వివరాలు చూపించు అని అడిగారు ఆ ఎస్సై. పైగా కేవలం ర్యాగింగ్ కదా.. ఇది అత్యాచారం కాదు మర్డర్ కేసు కాదు మీరు రావడానికి వార్త కవరేజ్ చేయడానికి అని ఆ ఎస్సై సెలవిచ్చారు.
News
వన్ టౌన్ పోలీసుల అత్యుత్సాహం