చింతల వాగు ప్రదేశాన్ని పరిశీలించిన సుజాతనగర్ ఎస్సై ఎం.రమాదేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి మరియు గరీబ్ పేట గ్రామం మధ్యలో చింతల వాగు రోడ్డు మీద నుండి ఉదృతంగా వాగు ప్రవహిస్తుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి తన సిబ్బందితో సందర్శించి ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేయడం జరిగింది.
వర్షాల కారణంగా రోడ్డు మీద పడిన చెట్లను సుజాతనగర్ పోలీస్ సిబ్బంది తొలగించడం జరిగింది. సుజాతనగర్ మండలంలో ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ వారికి తెలియజేయగలరు లేదా హండ్రెడ్ కి డైల్ చేయగలరు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు