డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఒకప్పుడు రాజుల కాలంలో గూడచారి పక్షులు, మృగాల పేరిట శత్రు దేశాలకు పంపి రాజ్యపు సమాచారాన్ని శత్రు దేశాలకు అందజేస్తూ ఉండేవని కథలు చరిత్రలో విన్నాము. కానీ నిజామాబాద్ లో మంగళవారం వింత ఘటన చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లాలో గూఢచారి పావురం కలకలం
రేపింది. బోధన్ రూరల్ భవానిపేటలో ఈ ఘటన
బోధన్లో గూఢచారి పావురం కలకలం మంగళవారం వెలుగు చూసింది. బాలుడికి అనుమానాస్పదంగా ఓ పావురం దొరికింది. అయితే ఆ పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్థులు గూఢచారి పావురంగా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.