డైలీ భారత్, కడప: సమాజ సేవా సమితి కడప జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా కొప్పరపు సాయి శివకేశవ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ గా ఎన్నికైన కొప్పరపు సాయి శివకేశవ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తానని సమాజ సేవా సమితి బలోపేతకానికి కృషి చేస్తానని తనను కడప జిల్లా లీగల్ అడ్వైజర్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.