డైలీ భారత్, కడప: ప్లాస్టిక్ జాతీయ జెండాలను నిషేధించాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి 500 అడుగుల భారీ జాతీయ జెండాతో జూనియర్ కళాశాల నుండి ఆర్ అండ్ బి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వాండ్రాసి పెంచలయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ తయారుచేసిన జాతీయ జెండాలను వినియోగించరాదని జాతీయ జెండా ప్రాముఖ్యత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని ఈ భారీ జాతీయ జెండా నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సమాజ సేవా సమితి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఎస్ కే జావిద్ భాష ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.