| Daily భారత్
Logo




దారుణం... మంత్రాల నేపంతో మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన కుటుంబం

News

Posted on 2025-08-14 11:30:36

Share: Share


దారుణం...   మంత్రాల నేపంతో మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన కుటుంబం

మోపాల్ మండలంలో దారుణం... 

మంత్రాల నేపంతో మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామంలో ని ఓ కుటుంబం

మోపాల్ పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం చేయాలంటూ కోరిన, అందని న్యాయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మోపాల్​ మండలంలోని పోలీసులు పట్టించుకోకపోవడంతో సీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం సింగంపల్లి  గ్రామానికి చెందిన పల్లికొండ సవిత నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో పని చేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన సవిత బావ పల్లికొండ గంగారం తన ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెలు తరచూ సవిత ఇంట్లోకి వచ్చి మూత్రవిసర్జన చేయడం, బియ్యం తినేయడం చేస్తున్నాయి. దీంతో పలుమార్లు సవిత వారికి చెప్పింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో చివరకు పల్లికొండ సవిత పల్లికొండ గంగారాం కొట్టంలో ఉన్న గేదెను తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్​ మందిరం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసింది. దీంతో తమ గేదెనే కట్టేస్తావా అంటూ.. బావ పల్లికొండ గంగారాం, చంద్రంపల్లి లక్ష్మి, ఆయన కొడుకు గంగారాం, కోడలు మమత కలిసి సవితపై మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి చితకబాదారు. మతిస్థిమితం కోల్పోయిన భర్త, నలుగురు పిల్లలతో కలిసి జీవితం నెట్టుకొస్తున్న సవిత గత్యంతరం లేక మోపాల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరినా స్థానిక మోపాల్ మండల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. చివరకు సీపీ సాయిచైతన్యను కలిసి ఫిర్యాదు చేసేందుకు గురువారం సీపీ కార్యాలయానికి వచ్చానని ఆమె పేర్కొంది.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >