Posted on 2023-12-21 08:10:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు ZPHS చంద్రంపేట పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ 136 వ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా (శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబర్ 22) శ్రీనివాస్ రామానుజన్ నెంబర్ 1729 ఆకృతిని మరియు చతుర్వీద ప్రక్రియలు (+,-,×,÷) లను విద్యార్థులచే ప్రదర్శించారు.మరియు విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస మరియి డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అందించిన గణిత సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాద్యాయుడు కొండికొప్పుల రవి, పాఠశాల ఉపాధ్యాయ బృందం దేవమని, పద్మ, రమ, హరిత రాణి, శ్రీనివాస్, రామ్ చందర్ రావు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
గణిత చతుర్విదా ప్రక్రియలు (×,÷,±)
1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు.
తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్ తడుముకోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3 ). ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి నిదర్శనం.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >