తనకు న్యాయం కావాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వృద్ధ మహిళ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాక్లూరు మండలం గాలిబ్ నగర్ కు చెందిన ప్రభావతి అనే మహిళకు చెందిన భర్త పది సంవత్సరాల క్రితం మృతి చెందారు. అప్పటినుండి ఇద్దరు కుమారులు తనను అక్రమంగా అన్యాయంగా ఇంటి నుండి గెంటి వేయడమే కాకుండా, తన ఇంటి స్థలం వద్ద ఉన్న ఎకరం నర భూమి ఇంటితోపాటు, ఐదున్నర ఎకరాల భూమిని తనకు తెలియకుండానే పట్టా తమపై మార్చుకొని తమను ఇబ్బందులు పెడుతున్నారని ప్రభావతి కుమార్తె శ్రీలత అతని మనుమడు రవి సహాయంతో సోమవారం ప్రజావాణిలో తమ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి వచ్చినట్లు బాధితురాలి కుమార్తె పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు పెళ్లయిన తర్వాత కట్నం కింద తమ తల్లిదండ్రులు 4 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని వాటిని కూడా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అది కూడా తమదేనని తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లికి పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని తమ సోదరులు కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, తో పాటు ఇతర ఉన్నతాధికారులు తమ విషయంలో కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.