| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దమ్మపేట పట్టణంలోని ఆటో అడ్డా కార్మికుల సర్వసభ్య సమావేశం

దమ్మపేట పట్టణంలోని ఆటో అడ్డా కార్మికుల సర్వసభ్య సమావేశం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పట్టణంలోని ఆటో అడ్డా కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులకు జీవన ఉపాధి దెబ్బతిన్నదని తక్షణమే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని తక్షణమే ఆటో కార్మికులకు ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరారు అలాగే ఆటో కార్మికులకు పట్టణాలలో ఆటో స్టాండ్ కొరకు స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు అలాగే ఆటో విడివిభాగాలపైన పన్ను శాతం తగ్గించి ఆటో కార్మికులు ఆదుకోవాలని ఆయన కోరారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుఏర్పాటు చేసి సంక్షేమ పథకాల అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

Previous ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం : ఎ సి పి రాజా వెంకట్ రెడ్డి
Next లోక్ షాహీర్ బాహు సాంటే ఆశయాలను సాధిద్దాం
ADVERTISEMENT