డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సెక్రటరీ పోశెట్టి అన్నారు.. వారు సూచించిన సేవా మార్గంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా పనిచేస్తుందని వారు తెలిపారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా సెక్రెటరీ పోశెట్టి మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 D డైరెక్టర్ గా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.. వారి అడుగుజాడల్లో వారు సూచించిన సేవా మార్గంలో తాము కూడా నడవడం జరుగుతుందని చెప్పారు.. ఘట్టమనేని బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఈరోజు అన్న ప్రసాదం, దివ్యంగా బాలలకు బట్టల పంపిణీ మరియు ఎనర్జీ డ్రింక్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి, ఎస్ సిద్దయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ పి రాజేశ్వరి,డిస్ట్రిక్ట్ చైర్మన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ప్రోగ్రాం చైర్మన్ రమేష్, ప్రోగ్రాం కో చైర్మన్ సంతోష్ రెడ్డి, డైరెక్టర్ ఎన్ సాయి లయన్స్ క్లబ్ సభ్యులు శైలజ,అంతోని మేరీ, గంగామణి, మహాలక్ష్మి నాగలక్ష్మి మరియు అనూష తదితరులు పాల్గొన్నారు..