| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈనెల 31న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి : టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు

ఈనెల 31న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి : టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు

కెజిబివి కార్మికుల వేతనాలు పెంచాలి

పని గంటలు పెంచే 282 జీవోను రద్దు చేయాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెజిబివి కార్మికుల వేతనాలు పెంచాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురంగోపాలరావుడిమాండ్ చేసారు.పని గంటలు పెంచే 282 జీవోను రద్దు చేయాలని

ఈనెల 31న జిల్లా కలెక్టర్  కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని

 గోపాలరావు  మండల కేంద్రంలోని కెజిబివి పాఠశాలలో  కార్మికుల తో జరిగిన సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ 

    కస్తూరిభా గాంధీ బాలికల విద్యాల యంలో పని చేస్తున్న కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమను చూపుతున్నాయని ఆరోపించారు. రూ 9,700 వేల రూపాయల చాలీచాలని వేతనాలతో   కార్మికులు తమ కుటుంబాలను పోషించు కుంటున్నారన్నారు. అసంఘటిత

రంగంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కేజీబీవి, సింగరేణి, మున్సిపాల్టీ, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ, మిడ్డేమిల్స్, అశా. అంగన్వాడీ, మిషన్ భగీరథ పథకంలో అసంఘటిత కార్మికులు అరకొర వేతనాలతో పనిచేస్తున్నారని ఎదులాపురం

అవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు గౌరవించాలన్నారు.  గత పన్నెండు ఏళ్ళుగా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సవరణకు ప్రభుత్వాలు ప్రయత్నించలేదని గోపాల రావు విమర్శించారు అసంఘటిత రంగ కార్మికులను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని ఎదులాపురం గోపాల రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

గత  ప్రభుత్వాల వెలుగులో నేటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా నడుస్తున్నదన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికుల సమస్యల అధ్యయనం కొరకు అమృతసేన్ కమిషన్ను నియమించిందని ఈ కమిషన్ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2008లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర కార్మికుల స్థితిగతులు పరిశీలించి రూల్స్ రూపొందించుకోవాలని సూచనలు చేసి  17ఏళ్లు గడుస్తున్నా  కార్మికుల పట్ల కనికరం  చూపించకపోవడం బాధాకరమని అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  కార్మికుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో పాటు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 282 జీవోను తెచ్చి పని గంటల మోపుతుందని దీని రద్దు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇన్సూరెన్స్ పెన్షన్ కనీసం 9000 ఇవ్వాలని ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని  జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారని ఈ పిలుపులో అధిక సంఖ్యలో  కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని గోపాలరావు విజ్ఞప్తి చేశారు 

ఈ కార్యక్రమంలో టి యు సి ఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిధ్దు, శిరీష , రమాదేవి,రాధ, స్వరూప, రేణుక, నిర్మల,అరుణ సునీత,కళ్యాణి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

Previous అంగరంగ వైభవంగా నాగేంద్ర గుడి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు
Next బర్త్ డే వేడుకల పేరుతో అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో రౌడీ షిటర్ ల వీరంగం
ADVERTISEMENT