| Daily భారత్
Logo




టీఎన్జీవో ఆధ్వర్యంలో ఈనెల 15న ఆషాడ మాస బోనాల ఉత్సవాలు

News

Posted on 2025-07-13 17:50:17

Share: Share


టీఎన్జీవో ఆధ్వర్యంలో ఈనెల 15న ఆషాడ మాస బోనాల ఉత్సవాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 15న మంగళవారం టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయం నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎన్జీవో ఆధ్వర్యంలో టిఎన్జీవో జిల్లా కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా, ఆషాడ బోనాల ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా, పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ మాత ఆలయ ప్రాంగణంలో బోనాల ఉత్సవాలు ఈ సంవత్సరం 15 తేదీన 11 గంటలకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగ సోదరిమణులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు,   టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్& డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యవర్గ బృందం, రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ బృందం, జిల్లా ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై, బోనాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని, ఆ జగదాంబ మాతా కృపకు పాత్రులై, టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

ఇట్టి సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ గారు, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, నిజాంబాద్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >