Posted on 2025-07-13 09:23:20
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలుకు ఆదివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలుత రైలు పట్టాలు తప్పిన తర్వాత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.
మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి తరలించడంతో పాటు, సమీప ఇళ్లలోని సిలిండర్‌లను తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కూడా నిలిపివేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో చెన్నై- అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని రైల్వే పోలీసులు వెల్లడించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >