Posted on 2023-12-13 09:59:42
డైలీ భారత్, న్యూఢిల్లీ: లోక్‌సభలో కలర్ స్మోక్ అలజడి పరుగులు తీసిన ఎంపీలు... లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది.రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు కలర్ స్మోక్ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. "ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. కలర్ స్మోక్ చల్లుతూ పరుగులు తీశారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే" అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. గ్యాలరీ నుంచి దూకి కలర్ స్మోక్ వదిలిన వారిలో ఒక వ్యక్తిని సాగర్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో కలర్ స్మోక్ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత కలర్ స్మోక్ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు.2001 సంవత్సరంలో ఇదే రోజున పార్లమెంట్ పై కొందరు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పార్లమెంటు ఆవరణలో కాల్పులకు దిగిన టెర్రరరిస్టులను భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి ఇవాళ ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, ఎపీలు నివాళులర్పిచారు. మళ్లీ ఇదే రోజు పార్లమెంటులో దుండగులు కలర్ స్మోక్ వదలడం ఒక్కసారిగా భయాందోళనలు రేపింది.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >