Posted on 2023-12-12 06:01:01
డైలీ భారత్, హైదరాబాద్:సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.
ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని..ఇలాంటి పొరపాటు మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.
ఫలితాలు వెలువడు తుండగానే..
డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి డీజీపీ హోదాలో అంజనీ కు మార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన ను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.
దీంతో ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్‌కు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసు కుంది. ఆ తర్వాత తెలం గాణ డీజీపీగా రవి గుప్తాను సీఈసీ నియమించింది.
ప్రస్తుతం ఆయనే డీజీపీగా కొనసాగుతుండగా.. ఇప్పుడు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయనను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? మరో ఏదైనా ఏ పోస్టు కేటా యిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.....
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >