| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మతాల పేరుతో మారణహోమం - తీవ్రంగా ఖండించిన TSUTF రాజన్న సిరిసిల్ల

మతాల పేరుతో మారణహోమం - తీవ్రంగా ఖండించిన TSUTF రాజన్న సిరిసిల్ల

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కాశ్మీర్ లో ఉగ్రవాదులచే జరిగిన హింసాకాండను TSUTF (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండించారు.

సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన సమావేశంలో TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పర్కాల రవిందర్ మాట్లాడుతూ

ఉగ్రదాడి లో అసువులు బాసినవారికి సంతాపాన్ని తెలియజేసారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కశ్మీర్ లోని అనంతనాగ్‌ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడడం చాలా విచారకరం అని బైసరన్‌ వద్ద పచ్చికబయళ్లు రక్తపుటేరుగా మారడం రక్తపు  మడుగులో పడి ఉన్న మృతదేహాలు, వాటి వద్ద మహిళలు విలపిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్‌ మీడియాను వణికించాయి అని  తన భర్త తలలో తూటా దిగిందని, ఆయనను కాపాడండి అంటూ ఓ మహిళ నిస్సహాయంగా అర్థిస్తున్న దృశ్యం ఓ వీడియోలో కనిపించింది అని తాను భేల్‌పూరీ తింటుండగా ఓ సాయుధుడు తన భర్త వద్దకు తుపాకీతో కాల్చివేసినట్లు మరో మహిళ తెలిపింది అని "ఇతను ముస్లిం కాదు.. కాల్చివేయండి" అని ఆ ఉగ్రవాది అన్నాడని ఆ మహిళ వివరించడం మరో వీడియోలో కనిపించింది అని మరో వీడియోలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి నేలపై పడి ఉన్న తన భర్తను లేపడానికి ప్రయత్నిస్తూ దయచేసి ఎవరైనా సాయం చేయండి అంటూ అర్థించడం హృదయాల్ని కలిచివేసే దృశ్యాలు అని ఇది  పిరికిపంద చర్య అని ఇలాంటి దుశ్చర్యలతో భారత అఖండత్వాన్ని భంగపరచలేరని భారత దేశమంటే సర్వమత సమ్మేళన సనాతన భూమి అని. ప్రభుత్వం దీన్ని ధీటుగా జవాబు ఇవ్వాలి అని భారతీయులంతా ఐక్యంగా ఎదుర్కోవాల్సిన సమస్య అని దుష్కర మూకల్ని పట్టుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో TSUTF పూర్వ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఎలగొండ రవి, సిరిసిల మండల కార్యదర్శి జంగిటి భానుచందర్, సీనియర్ ఉపాధ్యాయులు కరికె నరేందర్, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు

Previous గంభీరావుపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో MA ఇంగ్లీష్ ఎంట్రన్స్ కోచింగ్ ప్రారంభం
Next మతం పేరుతో మారణ హోమమా..?
ADVERTISEMENT