Posted on 2025-04-23 15:55:38
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పిజి ప్రవేశ పరీక్షలో భాగంగా వివిధ యూనివర్సిటీలు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ తో పాటు సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఈఫ్లు యూనివర్సిటీ కి సంబంధించిన ఎంట్రన్స్ కి కోచింగ్ ఈరోజు కళాశాలలో ఆంగ్ల విభాగం ఇంచార్జ్ డాక్టర్ యెలగొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి గారు మాట్లాడుతూ MA ఇంగ్లీష్ చేయడం వల్ల భవిష్యత్తులో అనేక అవకాశలు అందిపుచ్చుకోవచ్చని అలాగే ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని, తద్వారా బోధనా రంగంతో పాటు జర్నలిజం వైపు మరియు మంచి ట్రేైనర్స్ గా అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది.
ఆంగ్ల విభాగం ఇంచార్జి మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ యెలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ MA English చేయడం వల్ల ఆంగ్ల సాహిత్యంలో మంచి పట్టు సాధించుకోవటంతోపాటు, ప్రపంచ నలుమూలల మహత్తర విజ్ఞానాన్ని సొంతం చేసుకునే ఓ అద్భుతమైన ఆయుదంలా, ప్రపంచ నలుదిక్కుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవటంలో దోహద పడుతుందని విశిష్ట రంగాల్లో రాణించవచ్చునని పలు రకాల ఉదాహరణలతో విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభాకర్, సిహెచ్ మహేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పాక ధర్మపురి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వి వాణి, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ ఆది విష్ణు, శ్రీనివాస్ మహేష్ తదితర అధ్యాపకులు అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >