| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలోఎంప్లాయిబిలిటీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పై సర్టిఫికెట్ కోర్స్ నిర్వహణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలోఎంప్లాయిబిలిటీ అండ్ సాఫ్ట్ స్కిల్స్   పై సర్టిఫికెట్ కోర్స్ నిర్వహణ

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో   ఆంగ్ల విభాగం  ఆధ్వర్యంలో   విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే అంశం పైన సర్టిఫికెట్ కోర్స్ కు సంబంధించిన ప్రారంభ సమావేశం ఆంగ్ల ఇన్చార్జ్ డాక్టర్ వై ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రంగంలో ఇంగ్లీష్ స్కిల్స్ చాలా అవసరమని వాటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ పోటీ ప్రపంచంలో ఆంగ్లంపై పట్టు సాధిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు మీ సొంతమవుతాయని తెలియజేయడం జరిగింది.

అలాగే డిపార్ట్మెంట్ ఇంచార్జ్ డాక్టర్ వై ఆంజనేయులు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకత, అత్యున్నత అవకాశాలు పెంపొందిచుకోవటంలో కీలక పాత్ర పోసిస్తాయనీ  విద్యార్థులను అగ్ర భాగాన నిలుపుతాయని మరియు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్స్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత తదితర అంశాలపై క్లుప్తంగా వివరిస్తూ ఇట్టి అద్భుత అవకాశాన్ని విద్యార్థులంరు వినియోగించుకోవలనీ తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభాకర్, సిహెచ్ మహేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పాక ధర్మపురి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వి వాణి, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ ఆది విష్ణు, శ్రీనివాస్ మహేష్ తదితర అధ్యాపకులు అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన TGSPDCL అసిస్టెంట్ ఇంజనీర్
Next గంభీరావుపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో MA ఇంగ్లీష్ ఎంట్రన్స్ కోచింగ్ ప్రారంభం
ADVERTISEMENT